ప్రతి నిజం పగటి కలగా నిరాశగా నిలవనా సాంగ్
ప ప్రతి నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతి క్షణం కలత పడగా నీరిక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళు ఈ ఎదురితా
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడగా
ప్రతి నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతి క్షణం కలత పడగా నీరిక్షగా గడపనా
1:పెదవులు మరచిన చిరునగవై నిన్ను రమ్మని పిలిచనా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిద్దుర పోయే ఎదను లేపి నిశిని చూపించనా
ఆశలు దాచిన దోసిట శూన్యం నీకే
కడగకు మా కన్నులనే వెలివేసి
ప్రతి నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతి క్షణం కలత పడగా నీరిక్షగా గడపనా
2:ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికినా నా కేక
శిలలను తాకిన ప్రతి ధ్వనిగా నిను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయి పయనం అయ్యగా
ఇసుకలో చేసిన సంతకమ నీ స్నేహం
ఏ అలజడి విందో తెలుపదు కాలం
చిత్రం ఎలా చెప్పను
రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం చిత్ర
సంగీతం కోటేశ్వరరావు