Wednesday, 22 March 2017

నవ్వుకుంటానే  నవ్వుకుంటానే  నువ్వు చేసిన గాయానికి నవ్వుకుంటానే
 నాలోనే నవ్వుకుంటానే  నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటానే నువ్వు చేసిన గాయానికి నవ్వుకుంటానే
  1 .   నా రెండూ కనులలోన  నీ నిండూ రూపం కదలాడెనే నను దహించే కాలాగ్ని ప్రమిదలై
నా గుండె లోతులోన మాయని గాయమే నిను చేర ఆశలేక మరిగి బరువు పెరిగెనే
చలియ నా శ్వాస ద్యాస నువై ..  నడిపావే ఇన్నాళ్ళు దేవతవై .....
నువ్వు లేని బ్రతుకు ముళ్ళ బాటలై .. గుచ్చే నా ఎదలోతున గునపమై ..
వేగలేక విరిగిపోకు విలవిలలాడే మనసే   (నవ్వుకుంటానే)
2. కనికరించ నవ్వు చాలు కసిరే చూపేందుకు నీ జతలో క్షణము చాలు లేని యుగాలేందుకు
నరకయాతన నాది నగుమోము నీదై దహనమయ్యే మది నాది దరహాసం నీదై  దిక్కుతోచనిది మరి నేనైతే
 ఎడారిలో ఎండమావి నువై మరణమే శరనమన్నది నా మనసే నీ ఉసులు తలచే నా ఎద స్వాసే
మరవలేక మరణించగా  మరుగుతున్న బ్రతుకు నాది (నవ్వుకుంటానే )

No comments:

Post a Comment