అందమైన తెలుగు పాటను వినుకుంటూ మన నోట పాడుకుంటూ ఆనందం గా
జీవితాన్ని గడుపుదాం
కొందరు భాదలో కొందరు సంతోషం తో ఈ సంగీతాన్ని వింటారు వినటం తో పాటు పాడటమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం
Saturday, 29 April 2017
brundavana mali telugu song lyrics
సమగమ సమాగమగసదా నీ సా గమదని సమగస నిసదని మదగమ బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావనమాలి... ఆ... బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
super son
ReplyDeleteThis song is not available in gana and
ReplyDeleteJio saavan 😔
Very nice song
ReplyDeleteapu chesi papu kudi ra
ReplyDelete